ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలతో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ మాలధారణ చేసినట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆమె శబరిమల అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వాములు పాల్గొన్నారు.
తెలంగాణ
అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి


