హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

WGL: నల్లబెల్లి(M)లోని గోవిందపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 32 మందికి మంజూరు పత్రాలు అందించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మలోత్ చరణ్ సింగ్ పత్రాలు అందజేశారు. సొంత స్థలం ఉన్న పేదలకు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల సాయం అందుతుందని, విడతల వారీగా నిధులు జమ చేస్తారని ఆయన తెలిపారు.