హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్

NGKL: కల్వకుర్తి మండలం మార్చాల‌కి చెందిన ఓడల మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఇవాళ విషయం తెలుసుకున్న కల్వకుర్తి మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఎడ్మ సత్యం రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎడ్మ కిష్టారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ. 5000 ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.