హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాయిమీది తండాలో తాగునీటి కష్టాలు

VKB: పెద్దేముల్ మండల పరిధిలోని బాయిమీది తండాలో తాగునీటి సమస్యతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఉన్న మూడు బోరు మోటార్లలో ఒకటి పూర్తిగా నీరు నిలిచిపోగా, మరో రెండు మోటార్ల ద్వారా కూడా అడపాదడపా మాత్రమే నీరు సరఫరా అవుతోంది. దీంతో గ్రామంలో తాగునీటి కొరత ఏర్పడింది. కనీస అవసరాలకు కూడా నీరు అందకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.