హైదరాబాద్: 28°C
తెలంగాణ

108 అంబులెన్స్ సేవలపై జిల్లా మేనేజర్ తనిఖీ

HNK: పట్టణంలోని కేయూసీ క్రాస్‌రోడ్లో అందుబాటులో ఉన్న 108 అంబులెన్స్‌ను శనివారం జిల్లా మేనేజర్ మంద శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఎన్డీటీ ట్యాబ్, జీపీఎస్ సాంకేతికత వినియోగంపై శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయాల్లో బాధితుల వద్దకు త్వరగా చేరుకుని నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో EMT చైతన్య తదితరులు పాల్గొన్నారు.