హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ ర్యాలీ

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ మత్స్యకారులు ర్యాలీ నిర్వహించారు. తమ వృత్తి ప్రాధాన్యతను చాటుతూ ఐక్యతను ప్రదర్శించారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు గడ్డిపోగుల రాము, కార్యదర్శి అల్లె శ్రీనివాసులు, గడ్డిపోగుల శివతో పాటు, పలువురు నాయకులు పాల్గొన్నారు.