హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోగడగూడలో క్రీస్తు రాజు వేడుకలు

ASF: బెజ్జూరు మండలం లంబాడిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని బోగడగూడ చర్చిలో క్రీస్తు రాజు పండుగ మహోత్సవాలు ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్నాయి. 22న ఉదయం 6 గంటలకు దివ్యపూజా బలి, రాత్రి 8 గంటలకు ఊరేగింపు, 8:45కు విందు ఉంటాయి. 23న ఉదయం 6 గంటలకు మరణించిన విశ్వాసుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. ఫాదర్లు జోబి, అజిస్ పొట్టనానియిల్ భక్తులను ఆహ్వానించారు.