హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైపులైన్‌కు లీకేజీ.. వృథాగా పోతున్న తాగునీరు

AKP: మునగపాక మండలంలోని పలు గ్రామాలకు నీరందించే ఏలేరు తాగునీటి పైపులైన్‌కు హరేరామ భవనం వద్ద లీకు ఏర్పడింది. అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ పనుల వల్ల పైపునకు రంధ్రం పడటంతో నెల రోజులుగా తాగునీరంతా వృథాగా పోతోంది. R&B, తాగునీటి సరఫరా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.