హైదరాబాద్: 28°C
తెలంగాణ

60 ఏళ్ల పవిత్ర సిందూరం భక్తుల ఆస్తి: ఈవో

JGL: కొండగట్టు ఆంజనేయస్వామి మూలవిరాట్‌కు తొలగించిన సింధూరం నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి రానుందని ఈవో అంజనా రెడ్డి తెలిపారు. స్వామివారు 60 ఏళ్లుగా ఒంటిపై దాచుకున్న పవిత్ర సింధూరం భక్తుల ఆస్తి అని, నిజరూప దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు ఆ సింధూరంతో బొట్టు పెట్టుకుని వెళ్లాలని కోరారు. డిసెంబర్ 29 వరకు నిజరూప దర్శనం కొనసాగనున్నందున భక్తులు క్షేమంగా వచ్చి దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు.