హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో విధ్వంసం.. 400 మందిపై కేసులు

ATP: తాడిపత్రిలో నిన్న జరిగిన విధ్వంసంపై పోలీసులు సీరియస్ యాక్షన్ చేపట్టారు. ఘటనకు సంబంధించి టీడీపీ, వైసీపీకి చెందిన సుమారు 400 మంది కార్యకర్తలపై తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. తనపై దాడి జరిగిందంటూ పెద్దారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, జేసీ వర్గీయుల ఫిర్యాదుతో పెద్దారెడ్డిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది.