హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీవ్ రహదారిపై ఆటో బోల్తా!

SDPT: బెజ్జంకి మండలం తోటపల్లి–దేవక్కపల్లి గ్రామాల మధ్య రాజీవ్ రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. సిద్దిపేట నుంచి ధర్మపురికి వెళ్తున్న ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.