హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి 750 ఐబ్రెస్ట్ పరికరాలు

GNTR: మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు రాష్ట్రానికి 750 ఐబ్రెస్ట్ పరికరాలు చేరినట్లు ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సెన్సార్ల సాయంతో రొమ్ములో గడ్డలు, అసాధారణ మార్పులను ఈ పరికరాలు గుర్తిస్తాయి. వీటి విలువ సుమారు రూ.56 కోట్లు. త్వరలో లక్షలాది మంది మహిళలకు వీటితో పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.