హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోతుల బెడద.. ప్రజలకు ఇబ్బందులు

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా పెరిగింది. గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడటంతో పాటు ప్రజలపై, ధాన్యంపై దాడులు చేస్తున్నాయి. కోతుల బెడద కారణంగా రైతులు కూరగాయల సాగుకు దూరమవుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కోతులను తరలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.