హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్లను కలిసిన MLA నాయిని

హనుమకొండలో శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డితో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వాకర్స్‌ను కలిశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, జేఎన్ఎస్ మైదానం, పబ్లిక్ గార్డెన్‌లో వాకింగ్‌కు వచ్చిన వారితో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తం రెడ్డికి మద్దతు ఇవ్వాలని గ్రాడ్యుయేట్లను కోరారు.