ఉమ్మడి వరంగల్ జిల్లాలో 42 మండలాలను మధ్యస్థ కరవు ప్రాంతాలుగా గుర్తించినప్పటికీ రైతులకు ఊరట లభించడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. పంట నష్టాల అంచనా, పరిహారం, రుణాల రీషెడ్యూల్పై స్పష్టత లేదు. యాసంగి రుణాలు, సాగునీరు, పశుగ్రాసం, ఉపాధి పనుల విషయంలోనూ జాప్యం కొనసాగుతోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
కరవు మండలాల రైతులకు అందని భరోసా


