హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండవ రోజు నామినేషన్లు ఎన్నంటే?

కృష్ణా: జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది.  రెండో దశలో ఉయ్యూరులో 142 సర్పంచ్ స్థానాలకు 740 మంది, వార్డులకు గాను 3,166 మంది నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు సర్పంచి స్థానానికి 364, వార్డు మెంబరుకు 1,603 నామినేషన్లు దాఖలు చేశారు. మొవ్వ మండలంలో సర్పంచ్‌కి 67, వార్డు మెంబరుకు 272 మంది నామినేషన్లు వేశారు.