ADB: గాదిగూడ మండలంలో ఆముద గింజలు తిని ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులు ఆడుకుంటూ చెట్టు వద్ద ఆముద గింజలు తిన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు, కడుపునొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులు వారిని అంబులెన్సులో ఉట్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం 108లో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈఎంటి దత్తత్రి, పైలట్ సుందర్ ఉన్నారు.
తెలంగాణ
ఆముద గింజలు తిని ఆరుగురు చిన్నారులకు అస్వస్థత


