KNR: ఎల్‌నినో ప్రభావం, ప్లాస్టిక్ రహిత నగరం లక్ష్యంగా కరీంనగర్ నగరపాలక సంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. మేయర్ కోలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నీటి వృథాకు రూ.500 నుంచి రూ.1,000, ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వాడితే రూ.5 వేల నుంచి రూ.25 వేల జరిమానా విధించాలని ఆమోదించారు. ప్రతి డివిజన్‌కు వర్షపు నీటి సంరక్షణ పనులకు రూ.2 లక్షలు కేటాయించారు.
తెలంగాణ
'నీటి వృథాకు జరిమానా తప్పదు'


