నిర్మల్ సోన్ మండలంలోని కడ్తాల్ జంక్షన్ వద్ద జాతీయ రహదారి-44 పైన ఉన్న సైడ్ రెయిలింగ్ ప్రమాదవశాత్తు వాహనం ఢీకొని విరిగి పోయింది. ఈ రెయిలింగ్ దెబ్బతిని చాలా రోజులు గడుస్తున్నా రహదారి నిర్వాహకులు ఇటు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు. ఏదేని ప్రమాదం జరగకముందే జంక్షన్ వద్ద తగిన రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు.
తెలంగాణ
'దెబ్బతిని విరిగిపోయిన సైడ్ రెయిలింగ్ బాగు చేయాలి'


