E.G: రాజమండ్రి అభివృద్ధిని పక్కనపెట్టి కూటమికి చెందిన ఆరుగురు ప్రజాప్రతినిధులు వాటాలు పంచుకోవడానికే పరిమితమయ్యారని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండున్నరేళ్లలో ఖర్చు చేశామంటున్న రూ.1,900 కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తనపై 25 శాతం కమిషన్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాటిని ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
'వాటాలు పంచుకోవడం తప్ప అభివృద్ధి లేదు'


