BDK: తెల్లం శరత్ హత్యకు నిరసనగా నేడు భద్రాచలం బంద్‌కు ఆదివాసీ ఐక్య జేఏసీ పిలుపునిచ్చింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని జేఏసీ నాయకులు కోరారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
నేడు భద్రాచలం బంద్‌కు జేఏసీ పిలుపు


