హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రి ఉన్నా.. పోస్టుమార్టం సౌకర్యాలు కరువు

NLG :మర్రిగూడ లో పోస్టుమార్టం సౌకర్యాలు లేక మృతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మృతదేహాలను 60 కిలోమీటర్ల దూరంలోని దేవరకొండ కి తీసుకెళ్లాల్సి వస్తోంది. రూ.3 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మించినా, పోస్టుమార్టం సదుపాయాలు, సిబ్బంది లేక అంత్యక్రియల్లో ఆలస్యం జరుగుతోంది. స్థానికంగా పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.