హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో కామారెడ్డి మహిళ

కామారెడ్డి: భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన చిట్టెడి సుచిత్ర ఆస్ట్రేలియాలో జరగనున్న ఎన్నికల బరిలో నిలిచారు. ది రిపబ్లికన్‌ పార్టీ ఆధ్వర్యంలో విక్టోరియా రాష్ట్రం లావర్టన్‌ నియోజకవర్గం నుంచి సుచిత్ర పోటీ చేస్తున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. 2014లో ఆమె విద్యాభ్యాసం నిమిత్తం ఆస్ట్రేలియాకి వెళ్లారు. అంతంపల్లి గ్రామానికే చెందిన భర్త రాకేష్‌రెడ్డి సహకారంతో ఇద్దరూ అక్కడే స్థిరపడ్డారు.