హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 23న డిప్యూటీ మేయర్ ఎన్నిక

ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 23న ఉదయం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతుందని కమిషనర్ వెంకటకృష్ణయ్య శుక్రవారం తెలిపారు. మేయర్ తో పాటు 62 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరవుతారు. అదేరోజు పరోక్ష పద్ధతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ పి.రాజాబాబు వ్యవహరిస్తారు.