హైదరాబాద్: 28°C
తెలంగాణ

దామరగిద్దలో మత్స్యకార దినోత్సవ వేడుకలు

NRPT: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా దామరగిద్దలో ముదిరాజ్ సంఘం నాయకులు గోడపత్రిక విడుదల చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. చేప పిల్లలు, వలలు, పడవల పంపిణీపై సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో మత్స్యశాఖ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.