హైదరాబాద్: 28°C
తెలంగాణ

MGMలో దంత వైద్య విభాగంలో సిబ్బంది కొరత

వరంగల్ MGM ఆస్పత్రిలోని దంత వైద్య విభాగం వైద్యుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రోజుకు 500 నుంచి 600 మంది రోగులు ఓపీకి వస్తుండగా, తగినంత మంది వైద్యులు లేక సేవలకు ఆటంకం కలుగుతోంది. ఆరు నెలల క్రితం బదిలీ అయిన ప్రొఫెసర్ స్థానాన్ని ఇప్పటికీ భర్తీ చేయలేదు. సీనియర్ రెసిడెంట్ల నియామకం కూడా చేపట్టలేదు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించాలన్నారు.