హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాత తరఫున మనవల నామినేషన్

కోనసీమ: ఆత్రేయపురం గ్రామ సర్పంచ్ పదవికి చిలువూరి రామకృష్ణంరాజు తరఫున ఆయన మనవడు, మనవరాలు సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తాత తరఫున మనవలే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. గతంలో సర్పంచిగా, జడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉన్న రామకృష్ణంరాజు మరోసారి ప్రజల మద్దతు కోరుతున్నారు.