హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు క్షేత్రపాలకుడిగా బేతాళుడు

JGL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కొండగట్టు ఆలయానికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామితో పాటు బేతాళ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా పూజలందుకుంటున్నారు. తమ కుటుంబాలకు ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భక్తులు వేడుకుంటారు. బేతాళ స్వామి ఆలయానికి దక్షిణ దిశలో శ్రీరాముని పాదుకలకు సంబంధించిన పవిత్ర స్థానం ఉన్నట్లు చెబుతారు.