MBNR: జడ్చర్ల పట్టణాన్ని ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉదయం 8 గంటలైనా మంచు తగ్గకపోవడంతో 44, 167వ జాతీయ రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వేగాన్ని తగ్గించి ప్రయాణించారు. మంచు దుప్పటిలో పట్టణం ప్రకృతి అందాలతో కనువిందు చేసింది.
తెలంగాణ
జడ్చర్లను కమ్మేసిన దట్టమైన పొగమంచు


