హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

చిత్తూరు నగరం రాములవారిగుడి వీధిలోని జైన ప్రార్థనా మందిరంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నామని జైన సంఘం కార్యదర్శి సుభాష్ జైన్ తెలిపారు. ఉదయం 7 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందన్నారు. ఎంపికైన వారికి తిరుపతిలోని ఏసీ అరవింద కంటి ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్స చేయిస్తామన్నారు.