హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ!

VZM: భోగాపురం MPP ఎన్నిక మళ్లీ వాయిదా పడటంతో ఉత్కంఠ కొనసాగుతోంది. మండలంలోని 16 MPTC స్థానాల్లో వైసీపీ 6, టీడీపీ 3, జనసేన 3, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకున్నారు. మెజారిటీకి 9 మంది మద్దతు అవసరం కాగా, స్వతంత్రులు టీడీపీకి మద్దతిస్తామని చెబుతున్నట్లు సమాచారం. అయితే ఎంపీపీ పదవిని జనసేన ఆశిస్తోంది. దీంతో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.