హైదరాబాద్: 28°C
తెలంగాణ

కడుపుకోత మిగిల్చిన ట్రాక్టర్ ప్రమాదం

BDK: టేకులపల్లి మండలం, చర్లపల్లికి చెందిన కోరం మధు గురువారం రాత్రి ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మధుకు మూడేళ్ల కుమార్తె ఉంది. భార్య రెండో ప్రసవం కోసం డిసెంబర్ 2న ఎదురుచూస్తున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. భర్త మరణ వార్తతో గర్భిణి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.