హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఇళ్ల పేరిట రూ.12 లక్షల మోసం

ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ మోసాలు చేస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు యువకులను హైదరాబాద్‌లోని కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సాయిరామ్, వినుకొండకు చెందిన తిరుపతిరావు, చెరుకుపల్లికి చెందిన జగదీష్‌బాబు ముఠాగా ఏర్పడి డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇళ్ల నకిలీ పత్రాలతో బాధితుల నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు చేసి అరెస్ట్ అయ్యారు.