హైదరాబాద్: 28°C
తెలంగాణ

KTRను కలిసిన ఏకశిలా విద్యాసంస్థల అధినేత

WGL: ఏకశిలా విద్యాసంస్థల అధినేత తిరుపతిరెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్న నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో కుటుంబ సమేతంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 22న వరంగల్ నగరంలో జరగనున్న కేటీఆర్ సభలో ఆయన సమక్షంలో తిరుపతిరెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.