KMR: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన ఎడ్ల నర్సింలు (34) పెద్ద చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 19న ఇంటి నుంచి పనికి వెళ్లిన నర్సింలు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెరువులో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం పంచనామా నిర్వహించారు.
తెలంగాణ
మిస్సింగ్ కేసులో విషాదం.. చెరువులో మృతదేహం


