హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలస్యంగా విధులకు.. నలుగురిపై చర్యలు

KMM: మధిర ఏరియా ఆసుపత్రిలో సమయపాలన పాటించకుండా విధులకు ఆలస్యంగా హాజరవుతున్న నలుగురు వైద్యులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కేంద్ర ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ కె. రాజశేఖర్ గౌడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య సేవలకు ఆటంకం కలిగించే నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పూర్తి భాద్యతతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.