SRD: హత్నూర మండలం ముచ్చర్ల గ్రామ శివారులో శుక్రవారం వరి ధాన్యం కోస్తుండగా విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ పూర్తిగా కాలిబూడిదైంది. పొలంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు యంత్రానికి తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కిందకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
విద్యుత్ తీగలు తగిలి దగ్ధమైన వరి కోత యంత్రం!


