హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో ఘనంగా ఉత్థాన ఏకాదశి వేడుకలు

KDP: పులివెందులలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం ఉత్థాన ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నవీన్ కుమార్ శర్మ స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.