WGL: జీడబ్ల్యూఎంసీ పరిధిలోని న్యూశాయంపేటలో వివాదాస్పద భూమిలో అనుమతులు లేకుండా నిర్మించిన ఏసీ రేకుల షెడ్డును టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. కమిషనర్ వెంకన్న ఆదేశాలతో ఏసీపీ నస్రీన్ బాను ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. గతంలో నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో తొలగించినట్లు అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
అనుమతులు లేని రేకుల షెడ్డు తొలగింపు


