హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోన్ చూడొద్దన్నందుకు వివాహిత సూసైడ్!

RR: హయత్‌నగర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం టీపీగౌరారం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (25) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నిరంతరం సెల్‌ఫోన్ చూస్తుండటంతో పని చేసుకోకుండా ఇలా ఉంటే ఎలా అని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు చిన్నారులను టీవీ ముందు కూర్చోబెట్టి గదిలోకి వెళ్లి ఉరేసుకుంది.