హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై బోల్తాపడిన లారీ

SRPT: సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై చివ్వెంల మండలం సర్వీతండా సమీపంలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి రహదారి మధ్యలోని మీడియన్ ప్లాంటేషన్‌లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు..