హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లి మందలించిందని వివాహిత ఆత్మహత్య

NLG: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం టీపీగౌరారానికి చెందిన లక్ష్మీదేవి (25) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సెల్‌ఫోన్ చూస్తూ పనులు చేయడం లేదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఆమె.. ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి గదిలో ఉరేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.