SRCL: ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లిలో వరి కొయ్యలు కాల్చిన విషయంలో వివాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లాల రమేష్ పొలంలో కొయ్యలు కాల్చడంతో పక్కనే ఉన్న మామిడి చెట్టుకు మంటలు అంటుకున్నాయి. దీంతో చెట్టు యజమాని కంకటి మొండయ్య, అతని భార్య రమేష్ ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. ఈ క్రమంలో దంపతులపై కర్రతో దాడి చేయడంతో గాయాలయ్యాయి.
తెలంగాణ
మామిడి చెట్టుకు మంటలు.. దంపతులపై కర్రతో దాడి


