హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాద బాధితుల ప్రాణరక్షణకు పోలీసులకు శిక్షణ

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 60 మంది పోలీసులకు ట్రామా లైఫ్ సపోర్ట్, క్రాష్ ఇన్వెస్టిగేషన్‌పై రెండు రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సేవ్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శుక్రవారం ముగిసింది. ప్రథమ చికిత్స, సీపీఆర్, ప్రమాద స్థల పరిశీలన, ఆధారాల సేకరణపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ విధి నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పీ డీ. జానకి తెలిపారు.