BHNG: మోత్కూరుకు చెందిన లక్ష్మీప్రసన్న, అంజలి, చైత్ర అనే అక్కాచెల్లెళ్లు రెండు నెలల క్రితం కట్టెల మధ్య చిక్కుకున్న ఉడుతను కాపాడి సంరక్షిస్తున్నారు. అప్పటి నుంచి ఉడుత వారితోనే ఉంటూ జామకాయలు తింటూ, చేతులు, భుజాలపై ఆడుకుంటూ, జేబులో దాక్కుంటోంది. బడికి వెళ్లేటప్పుడు సైతం వారి వెంట వస్తోంది. మూగజీవాల పట్ల ప్రేమ చూపితే అవి కూడా ఆప్యాయతను పంచుతాయని అన్నారు.
తెలంగాణ
ఉడుతతో అక్కాచెల్లెళ్ల అనుబంధం


