హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్రో స్టేషన్ పార్కింగ్‌లో బైక్‌ల చోరీ.. యువకుడి అరెస్ట్

RR: మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో బైక్‌ల చోరీ చేస్తున్న యువకుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డికి చెందిన ముత్యాల కళ్యాణ్ రాజ్ (19) పార్కింగ్‌లో హ్యాండిల్ లాక్ చేయని బైక్‌లను గుర్తించి దొంగిలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.