హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

JN: రఘునాథపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిల్పూరు మండలం నష్కల్ గ్రామానికి చెందిన పులిగిళ్ల రాజు (47) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ నెల 17న కోమళ్ల టోల్‌ప్లాజా సమీపంలో రోడ్డు దాటుతుండగా హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. చికిత్స పొందుతూ మృతి చెందారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై భరత్ తెలిపారు.