హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాను సంపూర్ణ అక్షరాస్యతగా తీర్చిదిద్దాలి'

ఏలూరు జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అక్షరాంధ్ర కార్యక్రమం అమలుకు రూపొందించిన 10 దశల కార్యాచరణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 2027 నవంబర్ నాటికి జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ఇంటింటికీ వెళ్లి నిరక్షరాస్యులను గుర్తించి, వారి పేర్లు నమోదు చేయాలన్నారు.