KMR: కామారెడ్డి గ్రంథాలయంలో శుక్రవారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఉందన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుంది: షబ్బీర్ అలీ


