హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్టు

HNK: దామెర మండలంలోని ఊరుగొండ లోకస్ బోర్డింగ్ స్కూల్ సమీపంలో శుక్రవారం రాత్రి పేకాట ఆడుతున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.37,500 నగదు, పేకముక్కలు, ఐదు సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం దామెర పోలీసులకు అప్పగించారు. జూదం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.